”డియర్ మేఘ” ఫస్ట్ లుక్

268
First look of Dear Megha

ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా రూపొందుతున్న ”డియర్ మేఘ” సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు స్టార్ హీరో రానా దగ్గుబాటి, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ విడుదల చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. హీరోలు రానా, విజయ్ సేతుపతి, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ”డియర్ మేఘ” చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ దాస్యన్ నిర్మాత.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉండగా… ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. ఆమె కన్నీటికి కారణం ఎవరు, ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది “డియర్ మేఘ” సినిమాలో తెలియనుంది.

“డియర్ మేఘ” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.