‘నిను వీడని నీడను నేనే’చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌

239

మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం ‘నిను వీడని నీడను నేనే’ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఇందులో అన్య సింగ్‌ కథానాయికగా నటించారు. మురళీ శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్ర‌లో న‌టించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అద్దంలో చూసుకున్న‌ప్పుడు త‌మ రూపంతో పాటు మ‌రో రూపం క‌నిపించ‌డం, దానికి వారు వేర్వ‌రు హావ‌భావాలు క‌న‌బ‌ర‌చ‌డం ప్రేక్ష‌కుల‌లో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుంది. అలాంటి విప‌త్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’.

పోలీసులకు మాత్రం దెయ్యం అంటే భయం ఉండదా? దెయ్యాల్ని పట్టుకోవడానికి మాకేమన్నా స్పెషల్‌ ట్రైనింగ్‌ ఇస్తారనుకుంటున్నారా?’ అంటూ పోసాని కృష్ణమురళి చెప్పిన డైలాగ్ న‌వ్వులు పూయిస్తుంది. ఈ సినిమా సందీప్ కిష‌న్‌కి మంచి హిట్ ఇస్తుంద‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే అర్ద‌మవుతుంది.

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాను వెంక‌టాద్రి టాకీస్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. జూలై 12న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.