దంగ‌ల్ బ్యూటీ .. జైరా వాసిం వెండితెర‌కి గుడ్‌బై ?

292

దంగ‌ల్ చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన న‌టి జైరా వాసిం. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా ఆమెకి ద‌క్కింది. ఈ చిత్రం ఆమెకి న‌టిగా మంచి పేరు తీసుకురావ‌డమే కాక ఎన్నో అవ‌కాశాల‌ని అందిపుచ్చేలా చేసింది. త్వ‌ర‌లో ప్రియాంక న‌టించిన బాలీవుడ్ చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్ ‘ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా ద్వారా సినిమా నుండి త‌ప్పుకుంటున్నాంటూ సుధీర్ఘ పోస్ట్ ద్వారా పేర్కొంది. తాను వృత్తిని, కులాన్ని పోల్చ‌డం న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌న‌నే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు జైరా తెలిపింది.

ఐదేళ్ళ క్రితం నేను తీసుకున్న నిర్ణ‌యం నా జీవితాన్నే మార్చేసింది. నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే చాలా పాపులారిటీ సంపాదించుకున్నాను. నేను ఎంతోమందికి రోల్ మోడ‌ల్ అని, విజ‌యానికి చిరునామా అని అన్నారు. నేను ఫ‌లానా సెల‌బ్రిటీలా గుర్తింపు తెచ్చుకేనేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఇందుకోసం నాలోని కొత్త టాలెంట్‌ని ప్రేక్ష‌కుల ముందు పెడుతూ, నా లైఫ్ స్టైల్‌ని పూర్తిగా మార్చుకుంటూ వచ్చాను. కాని ఇప్పుడు నాకు ఈ ప‌రిశ్ర‌మ‌లో ఉండాల్సిన దాన్ని కాద‌నే విష‌యం బోధ‌ప‌డింది. ఈ సినీ ప‌రిశ్ర‌మ నాకు ప్రేమ‌, మ‌ద్ద‌తు, ప్ర‌శంసల‌న్ని తెచ్చిపెట్టింది. కాని ఇదే ప‌రిశ్ర‌మ న‌మ్మ‌కం కూడా కోల్పోయేలా చేసింది. నేను ముస్లిం అయినందుకు కొంద‌రు నన్ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు నుండి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి ఆ భ‌యాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలా జ‌ర‌గ‌డం ఒక్క‌సారి కాదు వంద సార్లు. నా ప్ర‌శాంత‌త‌ని కోల్పోయేలా, అల్లాతో నాకున్న అనుబంధాన్ని చెడ‌గొట్టేలా ఉన్న ఈ వాతావ‌ర‌ణంలో నేను ఉండ‌లేక‌పోతున్నాను.

నేను నా బలహీనతను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను మరియు అల్లా మాటలతో నా హృదయాన్ని జతచేయడం ద్వారా నా జ్ఞానం మరియు అవగాహన లేకపోవడాన్ని ప్రయత్నించి సరిదిద్దడం మొదలుపెట్టాను. ఖురాన్ యొక్క గొప్ప దైవిక జ్ఞానంలో, నేను తగినంత శాంతిని కనుగొన్నాను. దాని సృష్టికర్త, అతని గుణాలు, అతని దయ మరియు ఆజ్ఞల జ్ఞానాన్ని పొందినప్పుడు హృదయాలు శాంతిని పొందుతాయి అంటూ జైరా త‌న సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది. మ‌రి జైరా పోస్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ అమ్మడు రానున్న రోజుల‌లో వెండితెర‌పై క‌నిపించ‌డం క‌ల‌నే అని అర్ధ‌మ‌వుతుంది.