ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మెతేరా స్టేడియాన్ని వర్చువల్ విధానం ద్వారా బుధవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు.
తర్వాత ఆ స్టేడియం పేరును నరేంద్ర మోడీ స్టేడియంగా పేరు మార్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, బీసీసీఐ సెక్రటరీ జై షా పాల్గొన్నారు.
లక్షా పది వేలకు పైగా సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోడీ (మొతేరా) రూపుదిద్దుకుంది.
ఈ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు జరుగుతోంది. భారీ స్టేడియం.. పైగా డే/నైట్‌లో గులాబి బంతితో మ్యాచ్ జరగబోతుండటం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
లక్షా 10 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నప్పటికీ కరోనా కారణంగా సగం మందికి మాత్రమే అనుమతి ఉంది.
గతేడాది ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన ఈ స్టేడియంలోనే మోడీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.