కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ ట్రైలర్

256
nandamuri kalyan ram mla trailer relesed

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ నెల 23న ‘ఎమ్మెల్యే’గా వచ్చేందుకు రెడీ అయిపోయాడు. విడుదల ముహుర్తం దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రచార హోరు పెంచేసింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘నేను ఇంకా రాజకీయం చేయటం మొదలు పెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయడానికి ఏమీ మిగలదు’ అంటూ ఇచ్చే వార్నింగ్ ఫుల్ జోష్ లో ఉంది. కల్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ఈ ఎంఎల్‌ఏ.



 

‘ఏ మామగారైనా పిల్లతో పాటు కట్నం ఇస్తారు. మా మామగారేంటో నాకు బామ్మర్దిని ఇచ్చారు’ అంటూ వెన్నెల కిషోర్ కామెడీ ఉంది ట్రైలర్ లో. .‘పిల్లలకు ఆస్తులిస్తే అవి ఉంటేనే బతుకుతారు. అదే చదివిస్తే ఎలాగైనా బతుకుతారు’ అని కాజల్‌ చెప్పే డైలాగులు చాలా సీరియస్ గా ఉన్నాయి. ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.