ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీను వైట్ల ఈ మధ్య సరైన సక్సెస్‌లు అందుకోలేకపోతున్నాడు. త్వరలో రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన పాత ఫాంని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు శ్రీను వైట్ల. మరోవైపు తన భార్య రూప వైట్లతో బిజినెస్ స్టార్ట్ చేయించాడు.
వేదిక్ అనే బ్రాండ్ ద్వారా వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలు పెట్టగా, దీనిని కాజల్ ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా తొలుత ఆవు పాలని విక్రయించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు రూపా వైట్ల. ఎన్నో బ్రాండ్స్ మనకు అందుబాటులో ఉన్నప్పటికి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ చాలా ఉండటంతో ఈ రంగం వైపు మొగ్గుచూపారు రూపా. ”ఇది ఓ విధానం కాదు.. విప్లవం” అంటూ వేదిక్ బ్రాండ్ తో మార్కెట్లో తొలి అడుగు వేస్తున్నారు రూపా వైట్ల. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన దూకుడు సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన రూపా ఇప్పుడు ఈ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం.
Happy to launch @Vedic_Way by @roopavaitla pure, organic and pristine! Thank you for my wholesomeness 😊🤗 pic.twitter.com/qHDFAupnuV
— Kajal Aggarwal (@MsKajalAggarwal) March 23, 2018