
రూ.30 లక్షల జరిమానా
లక్నో : పశువుల దాణా కుంభకోణంలోని నాలుగో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జెడియు నేత లాలూప్రసాద్ యాదవ్‌కు రాంచీ హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 30లక్షల జరిమానాను విధించింది. ఇదే కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రాతో పాటు, మరో 31మందిని నిర్దోషులుగా జార్ఖండ్‌లోని రాంచీ హైకోర్టు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
1990లో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ ఖజానా నుండి రూ. 3.18 కోట్లు దుర్వినియోగానికి పాల్పడిన కేసులో లాలూ ఇప్పటికే జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ఈ కుంభకోణంలో మొదటిసారిగా 2013లో ఐదేళ్లపాటు జైలుశిక్షను అనుభవించారు. అనంతరం డిసెంబరు 23, 2017లో రెండవ కేసులో మూడున్నరేళ్లు శిక్షను విధించారు. ప్రస్తుతం మూడవకేసులో చాయిబాసా జైలులో ఐదుసంవత్సరాల శిక్షను అనుభవిస్తున్నారు. లాలూపై రాంచీలో ఒకటి, పాట్నాలో మరొకటి చొప్పున మరో రెండు కేసులు నమోదయ్యాయి.