బాంబు కోసం వెతికితే బంగారం దొరికింది

241
3-kg-gold-bars-found-in-washroom-at-delhi-airport

న్యూఢిల్లీ : స్థానిక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయంలోని వాష్‌ రూమ్‌లో 3 కేజీల బంగారం దొరికినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. బాంబు ఉందనే సమాచారంతో విమనాశ్రయంలో సిఐఎస్‌ఎఫ్‌ బలగాలు బాంబు స్వ్కౌడ్‌ను రంగంలోకి దింపాయి. ఈ సోదాల్లో మహిళల వాష్‌రూంలో రూ. 90 లక్షల విలువ గల బంగారం దొరికినట్లు అధికారులు చెప్పారు.



 

తెల్లని పేపర్‌ టేప్‌లో చుట్టి ఉన్న ఒక ప్యాకెట్‌లో 3 కిలోల బరువున్న 3 బంగారు బిస్కెట్లు ఉన్నాయని, ఒక్కొక్కటీ ఒక కేజీ బరువుందని తెలిపారు. దీంతో కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందించి బంగారాన్ని వారికి అప్పగించామని సిఐఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించామని, మిగిలిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.