మీ-సేవ బాదుడు

232
AP-government-hikes-mee-seva-service-charges

అమరావతి : మీ- సేవాల్లో డిజిటల్‌ ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు వసూలు చేసే యూజర్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి కె విజయానంద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రూ.25గా ఉన్న ఎ కేటగిరీ సర్వీసుల యూజర్‌ ఛార్జీని రూ.35కు, రూ.35గాను, బి కేటగిరీ సర్వీసుల ఛార్జీని రూ.45కు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఛార్జీలను పెంచాలని మీ సేవా నిర్వాహకుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మీ సేవా యూజర్‌ ఛార్జీలను పెంచడం వల్ల ధ్రువీకరణ పత్రాలను పొందే ప్రతిసారీ సామాన్యులపై భారం పడనుంది.