
వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “నాంది”. విజయ్ కనకమేడల “నాంది” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ “నాంది” సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న “నాంది” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ బాగుందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మహేష్.
ఇక ట్రైలర్ విషయానికొస్తే… నరేష్ అండర్ ట్రయల్ ఖైదీగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తప్పు చేయకుండానే శిక్ష విధిస్తున్న ఖైదీ (అల్లరి నరేష్)కు న్యాయం చేయడానికి లాయర్ పాత్రలో పోరాడుతోంది వరలక్ష్మి శరత్ కుమార్.
ట్రైలర్ లోని డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనున్నాడని తెలుస్తోంది. “నాంది” ట్రైలర్ చూస్తుంటే అల్లరి నరేష్ కు ఈసారి హిట్ పక్కా అన్పిస్తోంది. ప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా “నాంది” ట్రైలర్ ను వీక్షించండి.