ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్!

147
Someone behind Sharmila's party

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసులో కోర్టు విచారణకు వరుసగా గైర్హాజర్ కావడంతో ఆమెకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఈ నెల 9వ తేదీలోపు వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది.అధే విధంగా వేర్వేరు కేసుల్లో తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరావు నిన్న కోర్టుకు హాజరయ్యారు.

ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు కోర్టు సమన్లు జారీ చేసింది.హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యారు.