
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాధేశ్యామ్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రేమికుల రోజున “రాధేశ్యామ్” నుంచి సర్ప్రైజ్ రానుందని తెలుపుతో మేకర్స్ తాజాగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ మేరకు కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీన రాధేశ్యామ్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన దర్శకనిర్మాతలు ‘సేవ్ ది డేట్, ఈ దశాబ్దానికి గాను అతిపెద్ద ప్రేమ ప్రకటన’ అంటూ ‘రాధేశ్యామ్’ ప్రీ టీజర్ వదిలారు.
తాజాగా విడుదల చేసిన ప్రీ టీజర్‌లో ప్రభాస్‌ని ఓ రొమాంటిక్ లవర్ గా చూపించారు. టీజర్ లోని ప్రభాస్ యంగ్ లుక్ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ 30 సెకన్ల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Get ready for the biggest love announcement of the decade! ✨♥️
14th Feb, save the date! 💕 #RadheShyamPreTeaser ▶️ https://t.co/ALrESp2z7vStarring #Prabhas & @hegdepooja
Directed by @director_radhaa
Presented by @UVKrishnamRaju garu pic.twitter.com/TGyV5JVXLD— UV Creations (@UV_Creations) February 6, 2021
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా “రాధేశ్యామ్” తెరకెక్కుతోంది. 1960 దశకం నాటి ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
“రాధేశ్యామ్” చిత్రంలో సీనియర్ హీరోయిన్ సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ 20వ చిత్రమైన “రాధేశ్యామ్”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.