ఎల్ఈడీ టీవీలో పాము – మెకానిక్ షాక్

245
7 feet Snake in LED TV Andhrapradesh

అప్పుడప్పుడు భలే విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.

గిద్దలూరు దిగువమెట్టకు చెందిన ఓ ఇంటి యజమాని తన టీవీ పని చేయటం లేదని టీవీ మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాడు. మెకానిక్ టీవీని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. టీవీ లో 7 అడుగుల పాము ఉంది.

పామును చూసి ముందు మెకానిక్ భయపడ్డాడు. కానీ అది చనిపోయి ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగా పాము చనిపోయినట్టు గుర్తించాడు.

పక్కనే నిలబడి చూస్తున్న టీవీ యజమాని ఈ విచిత్రం చూసి కంగు తిన్నాడు. ఇంట్లో ఉన్న టీవీలోకి పాము ఎలా వచ్చిందో అర్ధం కాక అయోమయంలో పడ్డాడు.

అంతేకాదు పాము దూరిన టీవీని తాను తీసుకొచ్చానన్న విషయం తలచుకుంటేనే వణుకు పుడుతోందని అన్నాడు. చివరికి పాము కారణంగా తన టీవీ పాడైనందుకు బాధపడుతున్నట్టు చెప్పాడు.