బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’.హౌస్‌ఫుల్ ఫ్రాంచైస్‌లో రాబోతున్న నాలుగో చిత్రంకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. ఫర్హాద్ సంఝీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. అక్షయ్ కుమార్.. రాజకుమారుడు బాలా, హ్యారీ పాత్రల్లో నటించారు. 1419కి చెందిన రాజకుమారుడు బాలా.. 600 ఏళ్ల తర్వాత లండన్ నుంచి హ్యారీగా తిరిగి వస్తాడు.
ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్‌గఢ్ రాజకుమారి మధు పాత్రలో, లండన్‌కు చెందిన కృతి పాత్రలో కన్పిస్తారు. రితేశ్ దేశ్‌ముఖ్ 1419కి చెందిన బంగ్డు అనే నాట్యకారుడి పాత్రతో పాటు రాయ్ అనే పాత్రలోనూ కనిపిస్తారు. ఈయనకు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఆమె పాత్ర పేరు రాజకుమారి మాలా. 600 తర్వాత మళ్లీ పూజ పేరుతో పుడతారు. ఈ సినిమాలో మరో హీరో బాబీ డియోల్ కూడా ముఖ్య పాత్ర పోషించగా, ఆయన పాత్ర పేరు ధర్మపుత్ర. ఆ తర్వాత ధరమ్ పేరుతో పుడతాడు. ఈయనకు జంటగా కృతి కర్బంద నటించారు. ఇందులో ఆమె పాత్ర పేరు రాజకుమారి మీన. ఆ తర్వాత నేహాగా పుడతారు.
ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులకి ఆసక్తి కలిగించనున్నాయి. పునర్జమ్మల నేపథ్యంలో 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని అంటున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.