ఈ రోజు రాశి ఫలితాలు–ఆదివారం 29 సెప్టెంబర్ 2019

370
today rashi phalalu

మేష రాశి :
చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలకు అనుకూల దినం.

వృషభ రాశి :
ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.

మిథున రాశి :
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఈ రోజు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు/ భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.

కర్కాటక రాశి :
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్/ ట్రాన్స్‌ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహ రాశి :
మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు ఈ రోజు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య రాశి :
ఈ రోజు ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి.

తుల రాశి :
బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా ఈ రోజు సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్‌లో ఇబ్బందిపడే అవకాశముంటుంది.

వృశ్చిక రాశి :
మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో మునిగితేలుతారు.

ధనుస్సు రాశి :
ఈ రోజు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువకావడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి :
ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తుల కారణంగా లేదా నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

కుంభ రాశి :
ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. ఈ రోజు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు, ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం.

మీన రాశి :
కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు.