రెడ్‌మీ 8ఎ సేల్ ఆన్ లైన్ లో

431

షియోమీ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఎ ను ఇండియాలో విడుదల చేసిన విషయం విదితమే. ఐతే ఈ ఫోన్‌ విక్రయాలను నిన్నటి నుంచి ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో నిన్నటి నుంచి అమ్మకాలను ప్రారంభించగా, ఇవాళ్టి నుంచి ఈ ఫోన్ ఎంఐ హోమ్ స్టోర్‌లోనూ లభిస్తున్నది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6499 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999గా ఉంది.

రెడ్‌మీ 8ఎ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్ ను త్వరలోనే ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.