గీత గోవిందం టీజర్‌

388
geetha-govindam-teaser

విజయ్‌ దేవర కొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్‌ వాంటెండ్‌ సినిమాగా మారింది. ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ను చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసింది.
 

‘ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం నీదీ నాదీ’ అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ క‌ల‌లు క‌న‌డం, హీరోయిన్ చెంప‌దెబ్బ‌తో ఈ లోకంలోకి రావ‌డం.. ఇంకొక్కసారి అమ్మాయిలు.. ఆంటీలు.. ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్‌ పోసేస్తా.. అంటూ హీరోయిన్‌ వార్నింగ్‌ ఇవ్వడం… మొత్తంగా చూస్తే.. ఓ రొమాంటిక్ కామెడీ సినిమాగా గీత గోవిందం రాబోతుందనే ఫీలింగ్‌ కనిపిస్తోంది. ఇక మారవా అంటూ హీరోయిన్‌ డైలాగ్‌.. లేదు మేడం, ఐ యామ్‌ కంప్లీట్లీ డిసెంట్‌ నౌ అనడంతో నిజంగానే విజయ్‌ దేవర్‌కొండ డిసెంట్‌గా మారిపోయాడు. తొలి పాట, టీజర్‌తోనే అభిమానుల గుండెల్లో సరికొత్త ఫీల్‌ను కల్పిస్తున్న గీత గోవిందం, థియేటర్లలో మరెంత ఆకట్టుబోతోందనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.