రాజకీయ పార్టీ ఏర్పాటులో గద్దర్

463
gaddar new political party

ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘బహుజన రాజ్యాధికారమే లక్ష్యం’ పేరుతో గద్దర్‌ తన అభిమానులతో ఇష్ఠాగోష్టి సమావేశం నిర్వహించారు. ఓటు అనేది ఒక పోరాట రూపమని, అది నేడు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో బందీ అయిందని, అందుకే తాను ఓటు రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. రాజకీయ పార్టీ పెట్టే అంశంపై నెల రోజులపాటు భావ సారూప్యత ఉన్న పార్టీలు, రాజకీయ నిపుణులు, విశ్లేషకులతో చర్చిస్తానని చెప్పారు. పల్లె పల్లెలో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటానని, కళాశాలల్లో చర్చా వేదికలు ఏర్పాటు చేస్తానని, అభిమానులు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.




 

ఆగస్టు నెలాఖరులో 10 లక్షల మంది సమక్షంలో పార్టీ, మేనిఫెస్టో గురించి ప్రకటిద్దామని ప్రతిపాదించారు. వేములవాడలో ఈ సభను ఏర్పాటుచేసే అంశాన్ని చూచాయగా వెల్లడించారు. సోమవారం తాను ఓటు నమోదు చేయించుకుంటానన్నారు. ఓటు, ఆయుధం కలిసి జత కట్టలేవని, ఆయుధం వదిలి ఓటు రాజకీయంలోకి వస్తున్నానని తెలిపారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ ప్రభంజన్‌యాదవ్‌, జేబీ రాజు, సీఎల్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.