‘మ‌ను’ చిత్రం ట్రైలర్‌ విడుదల

493
manu-movie-trailor-released

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కీలక పాత్రలో నటిస్తున్న మిస్టరీ రొమాన్స్‌ డ్రామా ‘మను’. చాందినీ చౌదరి, జాన్‌ కోట్లీ, అభిరామ్‌, మోహన్‌ భగత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘తీగ కొండికి వానపామును ఎర వేస్తారు. వానపామును చూస్తూ తీగను వదిలేస్తుంది చేప. ఇరుక్కుంటుంది’ అంటూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. షార్ట్ ఫిల్మ్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.