టెస్టుల‌కు ప్లెసిస్ గుడ్‌బై

188
faf du plessis announces retirement from test cricket

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో 69 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 36 ఏళ్ల ప్లెసిస్ 40.03 యావ‌రేజ్‌తో 4,163 ప‌రుగులు సాధించాడు.

అంతేకాకుండా 10 సెంచ‌రీలు 21 అర్ధ సెంచ‌రీలు త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్ర‌స్తుతం పాకి్స్థాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్లెసిస్ బుధ‌వారం (17 ఫిబ్ర‌వ‌రి 2021) టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

ఈ మ‌ధ్య‌కాలంలో బ్యాటింగ్‌లో వరుస‌గా విఫ‌లం అవుతుండ‌టంతో ప్లెసిస్ ఈ నిర్ఱ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ఇటీవ‌లి కాలంలో శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో ప్లెసిస్ చేసిన సెంచ‌రీ అత‌డిని సంతృప్తి ప‌ర‌చ‌లేదు.

ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టు క‌నిపించిన ప్లెసిస్ హ‌ఠాత్తుగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నెలాఖ‌రులో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా జ‌ట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో త‌ల‌పడాల్సివుంది.

కానీ కోవిడ్‌-19 దృష్ట్యా చివ‌రి నిమిషంలో ఆ సిరీస్ ర‌ద్ద‌యింది. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్‌లో త‌న కెరీర్‌ను ముగించాల‌నుకున్న‌ట్టు ప్లెసిస్ తెలిపాడు.