“అక్షర” ట్రైలర్ ను విడుదల చేసిన త్రివిక్రమ్

266
Akshara Telugu Movie Trailer Released by Trivikram

సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై హీరోయిన్ నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ “అక్షర”.

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బెనల్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది.

తాజాగా ‘అక్షర’ సినిమా ట్రైలర్‌ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్ని కృష్ణ స్త్రీ పాత్రలను బలంగా రాయగలడు. విద్యా వ్యవస్థపై ఆయన నలుగురితో పంచు కోవాలనుకుంటున్న ఆలోచనలు అందరినీ ఆలోచింప జేస్తాయని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్” అని అన్నారు.

ఇక “అక్షర” ట్రైలర్… “అఖిల విశ్వాన్ని శాసించే ఆది శక్తి అక్షరమే” అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను ‘అక్షర’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

ఫిజిక్స్ చెప్పే టీచర్ అక్షర పాత్రలో నందితా శ్వేత కనిపిస్తోంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు.

కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు.

విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యింది అనే విషయాన్నీ సినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.