ఎర్ర‌కోట వ‌ద్ద క‌త్తులు తిప్పిన వ్యక్తి అరెస్టు

224
Man arrested turning knives at Red Fort

ఢిల్లీ ఎర్ర‌కోట వ‌ద్ద గణతంత్ర దినోత్సవం రోజున  ట్రాక్టర్ ర్యాలీలో కత్తి తిప్పిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జనవరి 26న ఎర్రకోట వద్ద మణీందర్ సింగ్ అలియాస్ మోని కత్తి తిప్పిన వీడియో వైరల్ అయింది.

దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.మ‌నీంద‌ర్ సింగ్ త‌న వ‌ద్ద ఉన్న రెండు త‌ల్వార్ల‌తో ఎర్ర‌కోట వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

అత‌న్ని సీఆర్‌పీసీలోని 41.1 నియ‌మం కింద ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.

మంగ‌ళ‌వారం రాత్రి అత‌న్ని పీతంపుర‌లోని సీబీ బ్లాక్ బ‌స్సు స్టాప్ వ‌ద్ద అరెస్టు చేశారు. స్వ‌రూప్ న‌గ‌ర‌లో ఉన్న అత‌ని ఇంటి నుంచి రెండు త‌ల్వార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఎర్ర‌కోట వ‌ద్ద భారీ త‌ల్వార్ల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న వీడియోను కూడా నిందితుడి ఫోన్ నుంచి సీజ్ చేశారు.