ఉపాధ్యాయురాలు ఆదృశ్యం – కోటికి పైగా అప్పులు

193
Hindi teacher missing

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెనాలి ఫ్లై ఓవర్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్మెంట్లో నివసించే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కనిపించటం లేదంటూ ఆమె భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తుళ్లూరు మండలం మందడంలో హిందీ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న దామర్ల ఝూన్సీరాణి(45) ఈనెల11వ తేదీ నుండి కనిపించటం లేదు.

వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన ఝాన్సీరాణి సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది.

ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయలుదేరి గాలిగోపురం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం పక్కన తన బైక్ పార్క్ చేసి, తాళాలు ఆ దుకాణ యజమానికి ఇచ్చి, తన భర్త వచ్చి వాహనాన్ని తీసుకుంటారని చెప్పి వెళ్ళిపోయింది.

కాగా…. ఆమెకు కోటికి పైగా అప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఆమె తన సెల్ ఫోన్ నుంచి కాకుండా వేరే ఫోన్ నెంబరు నుంచి బ్యాంక్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు త్వరలోనే ఝూన్సీరాణిని పట్టుకుంటామని అంటున్నారు.