
నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే 12 బార్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ 16వ తేదీతో ముగిసినట్టు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర ఒక ప్రకటనలో తెలియజేసారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా బార్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధి లో 7 బార్లకు గాను 23 దరఖాస్తులు
ఆర్మూరు మున్సిపాలిటీ లో 1 బార్ కు 14 దరఖాస్తులు
భీంగల్ మున్సిపాలిటీ పరిధి లో 1 బార్ కు 46 దరఖాస్తులు
బోధన్ మున్సిపాలిటీ లో 3 బార్లకు 9 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
ఈనెల 18 వ తేదీన న ప్రగతిభవన్, నిజామాబాద్ కలెక్టరేట్ లో ఉదయం 11 గంటలకు డ్రా తీయడం జరుగుతుందన్నారు.