కిరణ్‌బేడీకి ఉద్వాసన.. త‌మిళిసైకి అద‌న‌పు బాధ్య‌త‌లు

161
Dismissal of Kiran Bedi Additional Charge Tamilisai

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని ఆ పదవి నుంచి తప్పిస్తూ కేంద్రం  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి గత రాత్రి అధికారిక ప్రకటన విడుదలైంది.

ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

కొత్త గవర్నర్ నియామకం వరకు తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.కిరణ్‌బేడీని ఉన్నట్టుండి తొలగించడానికి గల కారణాలు తెలియరాలేదు.

దీంతో ఆమెపై వేటుకు గలకారణాలపై చర్చ జరుగుతోంది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్న వేళ  ఈ మార్పు వెనక రాజకీయ పరమైన కారణాలు ఉండొచ్చని అంటున్నారు.

సీఎం నారాయణస్వామితో తొలి నుంచీ ఘర్షణాత్మక వైఖరే ఆమె తొలగింపునకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.