దాచుకున్న రూ. 5 లక్షల నోట్లకు చెదలు

200
Hidden rupees Termites 5 lakh notes

ఇంటి నిర్మాణం కోసం కూడబెట్టుకున్న సొమ్ము చెదలపాలైంది. ఆ నోట్లను చూసిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన జమలయ్య విజయవాడ రోడ్డులోని దుకాణం నిర్వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఉన్న రేకుల ఇల్లు చిన్నగా ఉండడంతో దానిని పెద్దగా కట్టుకోవాలనిభావించాడు. అందుకోసం రూ. 10 లక్షలు పోగేయాలని నిర్ణయించుకున్నాడు.

గత రెండేళ్లుగా ప్రతి రోజు వ్యాపారంలో వచ్చే కొంత డబ్బును ఇంట్లోని ట్రంకు పెట్టెలో దాయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటి వరకు దాదాపు రూ. 5 లక్షలు కూడబెట్టాడు.

తాజాగా ఓ లక్ష రూపాయలు అవసరం ఉండడంతో పెట్టెను తెరవగా అందులోని దృశ్యం చూసి ఖంగుతిన్నాడు.

నోట్లన్నీ చెదలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కష్టపడి దాచుకున్న డబ్బు చెదలపాలు కావడంతో కుటుంభ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుని ఇంటికొచ్చి నోట్లకు చెదలు ఘటనపై ఆరా తీశారు.