“అర్ధశతాబ్దం” ఫస్ట్ సాంగ్ ను విడుదల చేసిన రకుల్ ప్రీత్ సింగ్
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియా జంటగా నటిస్తున్న చిత్రం "అర్ద శతాబ్దం". రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కార్తీక్ రత్నం "C/O కంచెరపాలెం" చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ ను స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేయడంతో సినిమాపై అందరికి ఆసక్తి...
మోసగాళ్లు : “డబ్బే మనది కుమ్మేస్కో” లిరికల్ వీడియో సాంగ్
24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్లు". జెఫ్రే గీ చిన్ "మోసగాళ్లు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌చంద్ర, రుహీసింగ్, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా "డబ్బే మనది కుమ్మేస్కో" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. సామ్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను హేమ చంద్ర ఆలపించారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ వీడియోను మీరు కూడా వీక్షించండి. ఇక తెలుగు, తమిళ, కన్నడ,...
నాంది : ఆకట్టుకుంటున్న “చెలీ” లిరికల్ వీడియో
వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "నాంది". విజయ్ కనకమేడల "నాంది" సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సతీష్ "నాంది" సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న "నాంది" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి "చెలీ" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఎన్.సి కారుణ్య, హరిప్రియ మారగంటి ఆలపించిన ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం...
రామ్ చరణ్ చేతుల మీదుగా “థీమ్ ఆఫ్ కిన్నెరసాని” విడుదల
ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తాజాగా నటిస్తున్న చిత్రం "కిన్నెరసాని". ఈ సినిమాకు రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ రమణ తేజ్ ఇంతకుముందు "అశ్వథ్థామ" చిత్రానికి దర్శకత్వం వహించారు. సాయి రిషిక సమర్పణలో రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈరోజు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్బంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రం నుంచి "థీమ్ ఆఫ్ కిన్నెరసాని" అనే వీడియోను...
A1 ఎక్స్‌ప్రెస్ : “అమిగో” లిరికల్ వీడియో సాంగ్
Amigo Lyrical Video Song : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై.... టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం "A1 ఎక్స్‌ప్రెస్". డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. హాకీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం...
“నాట్యం” టీజర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్
నిశృంకల ఫిల్స్మ్ బ్యానర్ పై ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "నాట్యం". సంధ్యరాజు, సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ బీ రామలింగరాజు కోడలు. దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోహిత్ బెహల్, భానుప్రియ, కమల్‌కామరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తాజాగా "నాట్యం" టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ "నాట్యం" టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నట్లుగా...
“శ్రీకారం” ట్రైలర్ విడుదల
కిశోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం "శ్రీకారం". ఈ చిత్రంలో శర్వానంద్ సరసన 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా "శ్రీకారం" సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. Presenting the teaser of #Sreekaram! Good luck to the...
ఆసక్తిని రేకెత్తిస్తున్న సుమంత్ “కపటధారి” ట్రైలర్
యంగ్ హీరో సుమంత్ తాజాగా నటిస్తున్న చిత్రం 'కపటధారి'. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్‌ఐగా కనిపించనున్నారు. కన్నడ చిత్రం ‘కావలుధారి’కి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందితాశ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సుమంత్ పుట్టినరోజు ట్రీట్ గా "కపటధారి" చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. "మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని స్కెలిటన్స్ బయట పడ్డాయి అంటూ మొదలైన...
బాద్‌షా “టాప్ టక్కర్” ఆల్బమ్ లో రష్మిక
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న ఓ బాలీవుడ్ వీడియో ఆల్బమ్ లో మెరిసింది. "టాప్ టక్కర్" పేరుతో తెరకెక్కుతున్న ఈ ఆల్బమ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. పాపులర్ హిందీ సింగర్, రాపర్ బాద్‌షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ ఈ పాటను పాడారు. ఈ టీజర్ లో బాద్‌షా, యువన్ శంకర్ రాజాలతో పాటు రష్మిక మందన్న కూడా ఉంది. "టాప్ టక్కర్" ఆల్బమ్ పూర్తి వీడియో త్వరలోనే విడుదల కానుంది. అయితే రష్మిక బాలీవుడ్ లో...
చావు కబురు చల్లగా : “మై నేమ్ రాజు…” లిరికల్ వీడియో సాంగ్
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యంగ్ హీరో కార్తికేయ "చావు కబురు చల్లగా" అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'మై నేమ్ రాజు.. సత్తే.. ఏమవుతాదిరో' అంటూ సాగే హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్ విడుదల చేశారు. ఈ...