చావు కబురు చల్లగా : “మై నేమ్ రాజు…” లిరికల్ వీడియో సాంగ్

218
My Name Iju Raju Lyrical From Chavu Kaburu Raju

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యంగ్ హీరో కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘మై నేమ్ రాజు.. సత్తే.. ఏమవుతాదిరో’ అంటూ సాగే హీరో కార్తికేయ ఇంట్రో సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటను సింగర్‌ రేవంత్ పాడ‌గా, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల లిరిక్స్ రాశారు. ఈ లిరికల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోందట. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని, అతిత్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

ఇటీవలే చిత్ర రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ విశేష స్పందన తెచ్చుకోగా, మార్చి 19వ తేదీన ఈ ‘చావు కబురు చల్లగా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.