యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా “సలార్”కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “సలార్”. ఈ సినిమాలో ప్రభాస్స, శృతిహాసన్ జంటగా నటించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామగుండంలో ప్రారంభించారు.
పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు విలన్ ఎవరనే విషయమై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్”లో విలన్ పాత్ర కోసం కన్నడ స్టార్ మధు గురుస్వామిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.
“నా తదుపరి ప్రాజెక్టు ‘సలార్’, ఈ బిగ్గెస్ట్ సినిమాలో భాగం కానుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ప్రశాంత్ నీల్, నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా” అని తాను ‘సలార్’లో భాగమవుతున్నట్లు మధు గురుస్వామి స్వయంగా ప్రకటించారు.
దీంతో మధు గురుస్వామి “సలార్”లో ప్రభాస్ కు విలన్ గా నటించబోతున్నాడన్న విషయం ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక త్వరలోనే దీనిపై ‘సలార్’ టీం అధికారిక ప్రకటన చేయనుందట. మధు గురుస్వామి కన్నడ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలు చేసి మంచి గుర్తింపు పొందారు.