“త్వరలోనే ఓ సర్‌ప్రైజ్…!” అంటున్న శ్రీరెడ్డి

260
Good News for Sri Reddy Fans

సెన్సేషనల్ బ్యూటీ శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్ట్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ”నా ఫ్యాన్స్ అంతా రెడీగా ఉండండి.. త్వరలోనే ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది మీ అందరికీ చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది” అంటూ తెల్ల చీర కట్టిన ఓ హాట్ సెల్ఫీ ఫొటో వదిలింది శ్రీ రెడ్డి. దీంతో వెంటనే శ్రీరెడ్డి పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఆమె పోస్ట్ చేసిన ఫోటో చూసిన ఓ నెటిజన్ ‘కడుపుతో ఉన్నావా ఏంటీ?’ అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు స్పందించిన శ్రీరెడ్డి ‘అరేయ్ వెదవల్లారా.. నేను ప్రెగ్నెంట్ కాదు.. అంతకు మించిన గుడ్ న్యూస్’ అని చెప్పింది. మరో నెటిజన్ పెళ్లా? ప్రశ్నించగా అది కూడా కాదని సమాధానం ఇచ్చింది.

మరి ఆ గుడ్ న్యూస్ ఏంటోననే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే శ్రీరెడ్డికి ఏదైనా సినిమాలో ఆఫర్ వచ్చి ఉండొచ్చని, అదే ఆ గుడ్ న్యూస్ అయ్యిం ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇక కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం అనంతరం చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి, సామాజిక మాధ్యమాలను వాడుకోవడంలో దూసుకుపోతోంది. అంతేకాదు వీలున్నప్పుడల్లా మూవీ స్టార్స్, పొలిటీషియన్స్ పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఈ వివాదాస్పద నటి.