గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

179
Green India Challenge : Koti Vruksharchana Poster Released By Kavitha

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి, హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో పచ్చదనాన్ని మరింతగా పెంచేలా సీఎం కేసీఆర్ ఆశయాలను అనుగుణంగా, ప్రతీ తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని కోరారు. తను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే సీఎం కేసీఆర్ కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎం.పీ సంతోష్ కుమార్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ , కిషోర్ మరియు తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్,స్టేట్ సెక్రటరీ మఠం బిక్షపతి, తెరాస నాయకులు దాదాన్నగారి సందీప్ పాల్గొన్నారు.