తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు సూర్య.
“నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. మన జీవితం ఇంకా సాధారణ పరిస్థితికి రాలేదన్న విషయాన్ని మనందరం గ్రహించాలి.
భయంతో వణికిపోకూడదు. అలా అని భద్రత, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకూడదు. నాకు వైద్యం అందిస్తోన్న వైద్యులకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
’கொரோனா’ பாதிப்பு ஏற்பட்டு, சிகிச்சை பெற்று நலமுடன் இருக்கிறேன். வாழ்க்கை இன்னும் இயல்பு நிலைக்கு திரும்பவில்லை என்பதை அனைவரும் உணர்வோம். அச்சத்துடன் முடங்கிவிட முடியாது. அதேநேரம் பாதுகாப்பும், கவனமும் அவசியம். அர்ப்பணிப்புடன் துணைநிற்கும் மருத்துவர்களுக்கு அன்பும், நன்றிகளும்.
— Suriya Sivakumar (@Suriya_offl) February 7, 2021
దీంతో సూర్య అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సినీ ప్రముఖులతో ప్రాటు అభిమానులు కూడా సూర్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇక గతేడాది సూర్య నటించిన “సూరారై పోట్రు” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో “ఆకాశం నీ హద్దురా” పేరుతో విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
ఓటీటీ ద్వారా విడుదలైన “ఆకాశం నీ హద్దురా” చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సూర్య ప్రస్తుతం తన 40వ సినిమాతో బిజీగా ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇమ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.