మోసగాళ్లు : “డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో” లిరికల్ వీడియో సాంగ్

187
Dabbe Manadi Kummesko lyrical video from Mosagallu

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్లు”. జెఫ్రే గీ చిన్ “మోసగాళ్లు” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నవీన్‌చంద్ర, రుహీసింగ్‌, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా “డబ్బే మ‌న‌ది కుమ్మేస్కో” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం.

సామ్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌ను హేమ చంద్ర ఆల‌పించారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ వీడియోను మీరు కూడా వీక్షించండి.

ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా మంచు విష్ణు నిర్మిస్తుండడం విశేషం.

“మోసగాళ్లు” చిత్రంలో ఏసీపీ కుమార్‌ అనే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు. అతిత్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.