ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

153

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఓ ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నారాయణపేట జిల్లా ధన్వాడకు చెందిన బాలరాజు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చవుదుతున్నాడు.

కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కళాశాల మూడో ఫ్లోర్‌లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల క్రితం బాలరాజు తల్లి అనారోగ్యంతో మృతి చెందారు.

మనస్తాపానికిగురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.