తెలంగాణ ఇంటర్ బోర్డ్ పరీక్షల ఫీజు గడువును పొడగించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించినట్టు బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 23 నుంచి మార్చి ఒకటో తేదీ మధ్య ఫీజు చెల్లించిన వారు రూ. 100 ఆలస్య రుసుంతో చెల్లించాలి.
మార్చి 2 నుంచి 8వ తేదీ మధ్యలో అయితే రూ. 500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మార్చి 9 నుంచి 15వ తేదీ మధ్యలో అయితే రూ. 1,000, మార్చి 16 నుంచి 22వ తేదీ మధ్యలో అయితే రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుందని బోర్డ్ తెలిపింది.