నాంది : ఆకట్టుకుంటున్న “చెలీ” లిరికల్ వీడియో

212
Cheli Lyrical Video Song from Naandhi

వేగేశ్న ఎస్‌వీ 2 బ్యానర్‌పై యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “నాంది”. విజయ్‌ కనకమేడల “నాంది” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు సతీష్ “నాంది” సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 19న “నాంది” చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి “చెలీ” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం.

ఎన్.సి కారుణ్య, హరిప్రియ మారగంటి ఆలపించిన ఈ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది.

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

“నాంది” చిత్రంలో అల్లరి నరేష్ అండర్‌ ట్రయల్‌ ఖైదీగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు.

ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, నవమి, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, దేవిప్రసాద్, ప్రమోదిని, మణిచందన తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఫిబ్రవరి 19న రానున్న ఈ సినిమాతో అల్లరి నరేష్ కు హిట్ పక్కా అని భావిస్తున్నారు.