మహేష్, రాజమౌళి సినిమా స్టోరీ లైన్ ఇదేనా ?

211
Rajamouli and Mahesh Babu Movie Storyline

క్రేజీ కాంబినేషన్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది.

మహేష్ కోసం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నారట. అయితే ఈ కథ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందట.

ఇప్పటి వరకు భారతీయ చిత్రపరిశ్రమ కనీవినీ ఎరుగని ఫారెస్ట్‌ యాక్షన్‌ ఎడ్వెంచర్‌‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని స్కెచ్చేశారట జక్కన్న.

ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో పోరాట సన్నివేశాలు రూపొందించాలని ప్లాన్ చేసిన జక్కన్న, ఈ క్రేజీ ప్రాజెక్టును 2022లో సెట్స్‌పైకి తీసుకురావాలని స్కెచ్చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో ఉండనుంది. ప్రేక్షకులు రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా గురించి ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా ప్రస్తుతం రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా చిత్రీకరణలో దుబాయ్ లో ఉన్నారు.