బిగ్ బాస్ 2 లేటెస్ట్ టీజర్ చూద్దామా..!

1142
big-boss-2-latest-teaser

జూన్ 10న ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2 సీజన్ కార్యక్రమంకి సంబంధించి జోరుగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంపై జనాలలో భారీగా ఆసక్తి కలిపించేందుకు పోస్టర్స్ , టీజర్స్ అంటూ వివిధ రకాలుగా ప్రచారాలు చేస్తున్నారు నిర్వాహకులు . ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి పార్ట్ భారీ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ ని అంత కన్నా రిచ్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ హౌజ్ లో 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు చేసే హంగామా కచ్చితంగా పీక్ స్టేజ్ కి తీసుకెళుతుందని అంటున్నారు. అంతేకాదు సీజన్ 2కి ప్రైజ్ మనీ కూడా భారీ మొత్తంలోనే ఉంటుందట. 

ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ 2 కార్యక్రమం ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కాన్సెప్ట్ ని వివరిస్తూ తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో విడుదల చేశారు నిర్వాహకులు. ఓ అక్వేరియంలో వివిధ రకాల చేపలని చూపిస్తూ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో రకంలా ఉంటారని చెబుతూ టీజర్ ని కట్ చేశారు. ఇక ఈ టీజర్ కి నాని వాయిస్ అందించారు. ఇది అందరిని అలరిస్తుంది. నాని నిర్మించిన అ అనే సినిమాలో చేపకి నాని వాయిస్ అందించిన విషయం విదితమే. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినీ లవర్స్ ఒక్కసారిగా అ సినిమా ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారట.