మేషరాశి : ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
వృషభరాశి :ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.
మిథునం :ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలుగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది.
కర్కాటకరాశి : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.
సింహరాశి : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.
కన్యరాశి : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.
తులరాశి : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.
వృశ్చికరాశి : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.
ధనుస్సురాశి : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. విశ్రాంతి తీసుకోవాలి.
మకరరాశి : ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.
కుంభరాశి : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.
మీనరాశి : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలువటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలు దూరం అవుతాయి. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.