ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ.299 కే

462
airtel-rs-299-pre paid plan-unlimited-calling-for-45-days

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రూ.299 కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 45 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి డేటా లభించదు. కేవలం ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనికొచ్చేలా ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు జియోలో రూ.299 ప్లాన్‌కు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.