‘భరత్ అనే నేను’ టీజర్

584
bharat-ane-nenu-movie-teaser

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. శనివారం (ఏప్రిల్ 7) ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ‘భరత్ అనే నేను’ థియేట్రికల్‌ టీజర్‌ను విడుదల చేశారు.



 

బ్యాక్‌గ్రౌండ్‌లో ‘భరత్‌ అనే నేను..’ అనే పాట సాగుతుండగా మహేష్ బాబు స్టైల్ ఆఫ్ పంచ్ డైలాగులు పేలుస్తూ టీజర్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. ఎ రిఫార్మర్‌, ఎ స్టేట్స్‌మెన్‌, ఎ గార్డియన్‌, ఎ మ్యాన్‌, ఫర్‌ ది కామన్‌ మ్యాన్‌, టేక్స్‌ ఎన్‌ అన్‌కామన్‌ పాథ్‌.. అంటూ ఆంగ్ల అక్షరాలను ప్లే చేస్తూ మరింత రక్తికట్టించారు.

హౌస్‌లో ఉన్న వారందరి డౌట్స్ క్లియరైతే.. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ టేక్ ఎ లీవ్ మేడమ్ స్పీకర్.. అంటూ టీజర్ ముగించారు. మొత్తం మీద కొరటాల శివ మార్క్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రాజకీయ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్‌తో సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సమకూరుస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ పక్కన బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ సందడి చేయనుంది. నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.