తల్లికాబోతున్న సానియా మీర్జా

755
tennis-star-sania-mirza-be-mom-soon

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తల్లికాబోతున్నదా..! అంటే తాజా గా ఆమె వ్యాఖ్యలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. శనివారం గోవా ఫెస్ట్‌- 2018లో ‘లింగ వివక్ష’ పై జరిగిన చర్చలో పాల్గొన్న సానియా తొలిసారి తన కుటుంబం గురించి మాట్లాడింది. తాను, తన భర్త, క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఆడపిల్లే కావాలనుకుంటున్నట్టు చెప్పింది. తన సంతానం ఇంటిపేరు కూడా ‘మీర్జా మాలిక్‌’గానే ఉంచనున్నట్టు సానియా తెలిపింది. ‘ఈ రోజు ఓ రహస్యం చెబుతాను. నేను, నా భర్త చర్చించుకున్నాం. బిడ్డపుడితే ఆ చిన్నారి సర్‌నేమ్‌ ‘మాలిక్‌’ కాదు ‘మీర్జా మాలిక్‌’. మా కుటుంబ నిర్ణయం అదే. అతడు ఆడపిల్లే కావాలనుకుంటున్నాడ’ని సానియా చెప్పింది.