ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌

441
water tap connection for only one rupee

వాటర్‌ బోర్డు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గృహానివాసదారులకు మళ్లీ రూ.1కే నల్లా కనెక్షన్‌ మంజూరు చేస్తుంది. దరఖాస్తుదారుల నుంచి ఎటువంటి అదనపు మొత్తాన్నీ వసూలు చేయకుండా జీబీ కాంట్రాక్టర్ల ద్వారా నూతన కనెక్షను ఇస్తుంది. గత సంవత్సరం పేదలకు రూ.1కే నల్లా కనెక్షన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలో సైతం నల్లా కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జలమండలి పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యుత్‌ బిల్లు, పట్టా లేదా సేల్‌ డీడ్‌ దస్తావేజులు అందుబాటులో లేనప్పుడు రూ.20 స్టాంప్‌ పేపర్‌పై అఫిడవిట్‌ ఇవ్వాలని పేర్కొంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాటర్‌ బోర్డు కోరింది.



 

తెల్ల రేషన్‌కార్డు గల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్లకు నల్లా కనెక్షన్ల మంజూరును మరింత సరళీకృతం చేస్తోంది. తెల్లరేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ అర్హతలను సైతం పరిశీలిస్తోంది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న కుటుంబాలకు సైతం వర్తింపజేయాలని యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 73 పట్టణ, నగర ప్రాంతాల్లో అమలు చేసే ఈ పథకంతో దాదాపు 25 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకానికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది.