నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 08)

482
today programs

ఉపన్యాస కళలో శిక్షణ
కార్యక్రమం: మీడియా జంక్షన్‌ ఆధ్వర్యంలో ‘ఉపన్యాస కళ’లో శిక్షణ
స్థలం: మీడియా జంక్షన్‌, గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌, ముషీరాబాద్‌
సమయం: సా. 6 – 9.30

‘కలం సైనికుడు’ డాక్యుమెంటరీ
కార్యక్రమం: ప్రజా జర్నలిస్ట్‌ కె.విరాహత్‌ అలీ జీవిత ప్రస్థానంపై జైత్ర కమ్యూనికేషన్‌ రూపొందించిన ‘కలం సైనికుడు’ డాక్యుమెంటరీ ఆవిష్కరణ
అతిథి: టి.హరీష్‌రావు.
ఈ కార్యక్రమానికి ప్రముఖులు కె.శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఘంటా చక్రపాణి, నందిని సిధారెడ్డి, జి.దేవీప్రసాద్‌, జె.గీతారెడ్డి, కె.రామచంద్రమూర్తి, కట్టా శేఖర్‌రెడ్డి, దేవులపల్లి అమర్‌, రసమయి బాలకిషన్‌, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు హాజరవుతారు.
స్థలం: ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, పబ్లిక్‌ గార్డెన్స్‌
సమయం: మ. 3



 

పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమం: శేషాద్రిరమణ కవులు రచించిన ‘నిజాం రాష్ట్ర ప్రశంస అను తెలంగాణ రాష్ట్ర ప్రశంస చారిత్రక ఖండకావ్యం, ఇతర పద్యాల పుస్తకావిష్కరణ
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: సా. 5
కార్యక్రమం: దేవనపల్లి వీణావాణి కవిత్వం ’నిక్వణ’ ఆవిష్కరణ సభ
స్థలం: రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌
సమయం: సా. 6

పురస్కార ప్రదానం
కార్యక్రమం: రుషి పీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో.. ‘మహోపాధ్యాయ, సాహిత్య శిరోమణి’ డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్యకు పురస్కార ప్రదానం
స్థలం: కౌతా కామకోటి కల్యాణ నిలయం, పద్మారావునగర్‌, సికింద్రాబాద్‌
సమయం: సా. 6

నృత్య ప్రదర్శనలు
కార్యక్రమం: గరిమ ఆర్య చే ‘కథక్‌’ ప్రదర్శన, పార్వతీ పరమేశ్వర సంగీత నృత్యాలయం విద్యార్థులచే ‘కూచిపూడి ్క్ష ఫోల్క్‌’
స్థలం: అంఫి థియేటర్‌, శిల్పారామం
సమయం: సా. 5.45

మయూర నృత్యాలు
కార్యక్రమం: సచ్చిదానంద కళాపీఠం, త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో… ’బాల గంధర్వుల మలయసమీరాలు మయూర నృత్యాలు
స్థలం: కళా వెంకటదీక్షితులు కళావేదిక
సమయం: సా. 5.30

పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్‌
సమయం: సాయంత్రం 6.30 (15వరకు)