నగరం లో ఈ రోజు కార్యక్రమాలు (ఏప్రిల్ 09)

412
today programs

సమ్మర్‌ క్యాంప్‌
కార్యక్రమం: కిషోర్‌ చరిత నిర్మాణ్‌ శిబిరం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మే 1వ తేదీ వరకు యోగా, షూటింగ్‌, ఉపన్యాసంతో పా టు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
స్థలం: కేశవ్‌ మెమోరియల్‌ స్కూల్‌, నారాయణగూడ 

సన్మానం
కార్యక్రమం: ప్రముఖ చిత్రకారులు రేణుకా సోంది గులాటీకి సన్మానం
స్థలం: ఆర్ట్‌ గ్యాలరీ, బంజారాహిల్స్‌.
సమయం: 17న ఉదయం 11గంటలకు

వంటలు
కార్యక్రమం: సెలబ్రిటీ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 12న వంటల కార్యక్రమం నిర్వహించనున్నారు.
స్థలం: తాజ్‌ దక్కన్‌ కోహినూర్‌ హాల్‌, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 నుంచి మ.3 వరకు

భరత విలాపం
కార్యక్రమం: రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ నిర్వహణలో భరత విలాపం.
స్థలం: నందమూరి తారకరామారావు మందిరం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం.
సమయం: ఈ నెల 20న సా. 6.30

సమావేశం
కార్యక్రమం: లలిత కళా సమితి సమావేశం.
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: 13న సా. 4.30 

మహిళా పురస్కారాల ప్రదానం
కార్యక్రమం: సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ సారథ్యంలో డాక్టర్‌ వాసిరెడ్డి సీతాదేవి మహిళా పురస్కారాల ప్రదానోత్సవం
స్థలం: త్యాగరాయగానసభ
సమయం: నేడు సా. 5.30

సినీ గీతలహరి
కార్యక్రమం: గానసవ్యసాచి ఎస్‌.బి.సుధాకర్‌ ఆధ్వర్యంలో మనసు కవి ఆచార్య ఆత్రేయను స్మరిస్తూ ఆత్రేయ అజరామర సినీ గీతలహరి.
స్థలం: రవీంద్రభారతి
సమయం: నేడు సా. 5.00

పురాణ ప్రవచనం
కార్యక్రమం: శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది వేంకట రామనాథశర్మచే ‘శ్రీ మద్భాగవత సుధ’ పురాణ ప్రవచనం.
స్థలం: శృంగేరి జగద్గురు మహా సంస్థానం. రమా సహిత సత్యనారాయణస్వామి దేవాలయం, అశోక్‌నగర్‌
సమయం: సాయంత్రం 6.30 (15 వరకు)