ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా విజేతగా నిలిచింది.
శనివారం మెల్‌బోర్న్‌లో జరిగిన మహిళల ఫైనల్స్‌లో ఒసాకా 6-4, 6-6తో వరుస సెట్లలో జెన్నీఫర్ బ్రాడ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఒసాకా మ్యాచ్ ఆద్యంతం ప్రత్యర్థి బ్రాడ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఈ గెలుపుతో ఒసాకా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నట్టయింది. ఓవరాల్‌గా ఆమెకిది నాలుగో గ్రాండ్ శ్లామ్ టైటిల్.
ఇందులో రెండు యూఎస్ ఓపెన్ (2017, 2020) మరో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2019, 2020) టైటిల్స్ ఉన్నాయి. ఈ తుది పోరులో జెన్నీఫర్ పోరాడినప్పటికీ ఒసాకా ఆమెకు ఏమాత్రం అవకాశమివ్వలేదు.
తొలి సెట్‌ను 41 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఒసాకా రెండో సెట్‌ను 36 నిమిషాల్లోనే ముగించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఓపెన్ యుగం టెన్నిస్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రెండోసారి గెలిచిన 12వ క్రీడాకారిణిగా ఒసాకా చరిత్ర పుటల్లోకెక్కింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను వరుసగా రెండుసార్లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. వరుసగా 21 మ్యాచ్‌లు గెలిచిన ఒసాకా హార్డ్ కోర్ట్ క్వీన్‌గా ఎదుగుతోంది.
మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి జెన్నీఫర్‌పై ఒసాకా ప్రత్యేకమైన కామెంట్ చేసింది.
భవిష్యత్తులో జెన్నీఫర్ తనకు ప్రధాన ప్రత్యర్థి అవుతుందని గతంలో చెప్పిన మాటలను ఒసాకా ఈ సందర్భంగా గుర్తు చేసింది. గత రెండేళ్లుగా ఒసాకా అద్భుత ప్రదర్శన ఇస్తోంది.
ఒసాకా ఆడిన ఆరు హార్డ్ కోర్ట్ గ్రాండ్ శ్లామ్ టోర్నీలకు గాను నాలుగింటిలో గెలుపొందింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆమె ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
దీన్ని బట్టి ఆమె ఎంత ఫామ్‌లో ఉందో తెలుస్తోంది. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్‌గా ఎంట్రి ఇచ్చిన ఒసాకా నాలుగైదేళ్లలో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచింది.
అతేకాదు ఆ ఏడాది ప్రపంచ 100వ ర్యాంక్‌లో ఉన్న ఒసాకా తర్వాతి ఏడాది టాప్-50లోకి వచ్చింది. అంతేకాకుండా కెరీర్‌లో వరుసగా నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన మోనికా సెలెస్ రికార్డును ఒసాకా సమం చేసింది.