“దృశ్యం-2″లో వెంకటేష్… ఇదిగో ఫోటో

204
Drishyam2 Telugu Remake Shoot From March

మోహ‌న్ లాల్, మీనా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మలయాళ చిత్రం “దృశ్యం”. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొంది బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కాగా ఇటీవలే దృశ్యం మలయాళ వెర్షన్ కు సీక్వెల్‌గా “దృశ్యం 2” విడుదలైంది.

జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు.

ఈ సీక్వెల్ కు కూడా భారీ ప్రేక్షకాదరణ లభించింది. దృశ్యం 2 రీమేక్ రైట్స్‌ని సురేష్ బాబు ద‌క్కించుకున్న విషయం తెలిసిందే.

కానీ వెంకీ ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని రీమేక్ చేస్తాడా లేదా అనే అనుమానం కలిగింది అందరికీ.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడమే అందుకు కారణం. ప్రైమ్ లో ఈ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులు చూడొచ్చు.

అయితే తాజాగా ఓ పిక్ ద్వారా వెంకీ ఈ సినిమా చేయబోతున్నాడని అంతా భావిస్తున్నారు.

దృశ్యం 2 డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌, నిర్మాత సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులతో క‌లిసి వెంకీ దిగిన ఫొటోని విడుద‌ల చేశారు.

దీంతో దృశ్యం 2 చిత్రాన్ని వెంకీ రీమేక్ చేయ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.