ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ జార్జ్ కొరోనెస్ వచ్చే ఏప్రిల్‌తో 100వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు. ఈ వయసులోనూ పోటీల్లో ఉత్సాహం పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తనకు దగ్గరగా ఉన్న వయసు వారితో క్వీన్స్‌లాండ్‌లో అధికారికంగా నిర్వహించిన 50మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు.
శుక్రవారం మెన్స్ మాస్టర్స్ కేటగిరీలో 100-104 ఏళ్ల మధ్య నున్న వారికోసం నిర్వహించిన పోటీలో జార్జ్ ఒక్కడే పాల్గొన్నాడు. 56.12 సెకన్లలో అతడు టార్గెట్‌ను చేరుకున్నాడు. 2014లో నిర్వహించిన టోర్నీలో జాన్ హ్యారిసన్ ఇదే కేటగిరీలో 1:31:19 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేశాడు. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకొని తాజాగా ఈ రికార్డును జార్జ్ బ్రేక్ చేశాడు. ఈ వయసులో కూడా యువకులు సాధించలేని ఫీట్‌ను జార్జ్ పూర్తి చేశాడని ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.