త‌మిళ అర్జున్ రెడ్డి లుక్ చూశారా ?

229
vikram unveils son dhruvs look for arjun reddy remake

స్టార్ హీరో, పేరున్న దర్శకులు ఎవరూ లేకపోయినా తెలుగు చిత్రసీమతో పాటు త‌మిళం, హిందీ ప‌రిశ్ర‌మ దృష్టిని ఆకర్షించిన చిత్రం అర్జున్ రెడ్డి. ముద్దు సన్నివేశాలతో కూడిన పోస్టర్స్, కొన్ని సంభాషణలతో ఈ చిత్రం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి గెట‌ప్ అదిరిపోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమా రిలీజ్ త‌ర్వాత చాలా మంది అభిమానులు అర్జున్ రెడ్డి గెట‌ప్‌ని ట్రై చేశారు. అయితే అర్జున్ రెడ్డి ఫీవ‌ర్ మ‌న తెలుగు రాష్ట్రాల‌కే కాక పొరుగు రాష్ట్రాల‌కి పాకింది. దీంతో అక్క‌డి నిర్మాత‌లు కూడా ఈ సినిమా రీమేక్ చేయాల‌ని భావించారు.ప్ర‌ముఖ న‌టుడు విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్‌ హీరోగా వ‌ర్మ అనే టైటిల్‌తో ద‌ర్శ‌కుడు బాల త‌మిళ‌ రీమేక్ చేస్తున్నాడు. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలోను ఈ సినిమాని రూపొందుతుంది. త‌మిళ చిత్రంలో ధ్రువ్‌ లుక్ ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొన‌గా, విక్రమ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌యుడి లేటెస్ట్ మూవీ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో ధ్రువ్ లుక్ అభిమానుల‌కి ఆనందం క‌లిగిస్తుంది. అర్జున్ రెడ్డి చిత్రం హిందీలోను రీమేక్ కానుంద‌ని తెలుస్తుండ‌గా, షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం.

Stargazing. #dhruvfinallyanatchathiram😋

A post shared by Vikram (@the_real_chiyaan) on