సుజుకి విడుదల చేసిన 2018 కొత్త వెహికిల్ జిక్సర్

498
Suzuki released new Jixer

సుజుకీ మోటార్‌సైకిల్స్‌ ఇండియా మంగళవారం మార్కెట్లోకి కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ జిక్సర్‌లో 2018 మోడల్‌తో పాటు జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ను కూడా విడుదల చేసింది. దిల్లీ ఎక్స్‌షోరూంలో జిక్సర్‌ ధర రూ.80,928, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర 90,037గా నిర్ణయించారు. ఈ రెండు మోటార్‌ సైకిళ్లలో అల్ట్రాలైట్‌ 155 సీసీ ఇంజిన్‌, సుజుకీ ఎకో ఫర్ఫార్మెన్స్‌ టెక్నాలజీ ఉంది.



ఈ సెగ్మెంట్లో జిక్సర్‌ పూర్తి స్థాయి సౌకర్యవంతమైన వాహనమని సుజుకీ ఇండియా ప్రతినిధి సంజీవ్‌ రాజశేఖరన్‌ తెలిపారు. తమకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌లలో ఈ వాహనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

జిక్సర్ ఎస్‌ఎఫ్‌బైక్ నడిపే వ్యక్తికి ఎదురు గాలి నుంచి సాధ్యమైనంతగా రక్షణ నిచ్చేలా ఫుల్ ఫెయిరింగ్ ఫీచర్‌తో ఈ బైక్ సిద్ధమైంది. ముందు వైపు ఫెయిరింగ్ మినహా మిగిలిన అన్ని అంశాల్లో ఈ కొత్త వేరియంట్ జిక్సర్‌ను పోలి ఉంది. ఈ బైక్‌లో ఐదు గేర్లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, క్లియర్‌లెన్స్ ఇండికేటర్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లున్నాయి.. నలుపు, తెలుపు, నీలం మూడు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుంది. దేశంలో అత్యంత చౌకగా లభించే పూర్తి ఫెయిర్డ్ మోటార్ సైకిల్ ఇదే అవుతుంది. ఫెయిరింగ్ బైక్ అంటే.. ఇంజిన్ ఉన్న ఫ్రేమ్‌ను కప్పి ఉంచేలా డిజైన్ చేసిన బైక్. గాలి ఒత్తిడిని తట్టుకోవడం దీని ఉద్దేశం.